ఏపీ మంత్రి వెల్లంపల్లి ఇంట్లో విషాదం

  • Publish Date - August 25, 2019 / 01:36 PM IST

విజయవాడ : ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి వెల్లంపల్లి చందలూరి మహలక్ష్మమ్మ ఆదివారం కన్ను మూశారు.

గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం సాయంత్రం మరణణించింది. ఆమె వయస్సు 73 సంవత్సరాలు.

ఆగస్టు 26వ తేదీ సోమవారం విజయవాడ బ్రాహ్మణ వీధిలోని మంత్రి స్వగృహం నుంచి అంతిమయాత్ర బయలు దేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.