సచివాలయాల ఫలితాలు ఎప్పుడంటే

  • Publish Date - September 19, 2019 / 02:35 AM IST

సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం, సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తు్ననారు. అక్టోబర్ 02వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 08వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఏపీలో మొత్తం 1, 26, 728 సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95 వేల 088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33 వేల 501 పోస్టులున్నాయి. పరీక్షల కోసం మొత్తం 21 లక్షల 69 వేల 814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే..19 లక్షల 74 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. నియామకాలు పొందిన వారికి రూ. 15 వేల స్టై ఫండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత శాశ్వత పే స్కేలు వర్తింప చేయనున్నారు. 

వార్డు సచివాలయాల్లో పోస్టులు
ఉద్యోగం ఖాళీలు
వార్డు కార్యదర్శి 3,307
మౌలిక వసతుల కార్యదర్శి (గ్రేడ్ 2) 3,601
శానిటేషన్ కార్యదర్శి (గ్రేడ్  2) 3,648
విద్యా కార్యదర్శి  3,786
ప్లానింగ్ కార్యదర్శి 3,770
సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్ 2) 3,786
ఆరోగ్య కార్యదర్శి 3,786
రెవిన్యూ కార్యదర్శి 2,170
మహిళా కార్యదర్శి 3,786

గ్రామ సచివాలయ పోస్టులు
ఉద్యోగం ఖాళీలు
పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 5) 7,040
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో – గ్రేడ్ 2) 710
ఏఎన్ఎం (గ్రేడ్  – 3) 9,754
పశుసంవర్థక అసిస్టెంట్ 9,886
గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ 794
గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్  – 2) 6,714
గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్ 400
మహిళా పోలీసు, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్  11,158
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ – 2) 11,158
డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్ – 6) 11,158
గ్రామ సర్వేయర్ (గ్రేడ్ – 3) 11,158
గ్రామ సంక్షేమ, విద్య అసిస్టెంట్ 11,158