టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ : ఎంపీలకు బాబు దిశా..నిర్దేశం

  • Publish Date - January 26, 2019 / 08:54 AM IST

విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఇంకా ఏపీకి రూ. లక్షా 16వేల కోట్లు ఇవ్వాలని బాబు తెలిపారు. 

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలను వాడడం లేదని..ఇందులో వందకు వంద శాతం హ్యాకింగ్‌ జరిగే అవకాశాలున్నాయన్నారు. కేంద్రం నుండి పన్ను రాయితీల కోసం…ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఎంపీలు ఒత్తిడి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదికను కేంద్రానికి ఇవ్వాలని..ఈ నివేదికను అన్ని మంత్రిత్వ శాఖలకు అప్పగించాలని..జయప్రకాశ్ నివేదిక కేంద్రానికివ్వాలని సూచించారు. అలాగే పవన్ నియమించిన జేఎఫ్‌సీ నివేదికను కూడా కేంద్రానికి ఇవ్వాలని బాబు సూచించారు. ఇంకా ఎలాంటి అంశాలు చర్చించారో…తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు