వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే ఉచిత కంటి పరీక్షలు చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు రూ. 250 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మొత్తం రూ. 560 కోట్లను కేటాయించింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 2022 జనవరి 31వ తేదీ వరకు 6 దశల్లో కంటి వెలుగు కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.
తొలి, రెండు దశల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి చదువుకున్న 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కుడి, ఎడమ కంటి చూపును వైద్యులు పరీక్షిస్తారు. ఇందు కోసం ప్రతి పాఠశాలకు కిట్‌లను పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కిట్‌లో టార్చ్ లైట్, చార్టు, టేపు, ఇతరత్రా సామాగ్రీ ఉంటాయి. ఒక్కో కిట్‌కు రూ. 150 వరకు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. మూడు నుంచి ఆరు దశల్లో సుమారు రూ. 4 కోట్ల మందికి కంటి పరీక్షలు జరుపుతారు. అవసరమైన వారికి ఆపరేషన్ చేపడుతారు. డయాబెటిక్, రెటినోపతి, చైల్డ్ హుడ్ బ్లైండ్ నెస్, గ్లకోమా కేసులకు రూ. 2 వేల చొప్పున చెల్లించనున్నారు.
Read More : శరన్నవరాత్రి ఉత్సవాలు : పంచహారతుల విశిష్టత