జగన్ పై దాడి కేసు : ఎన్ఐఏ విచారణ వేగవంతం

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం అయింది.

  • Publish Date - January 11, 2019 / 07:06 AM IST

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం అయింది.

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం అయింది. జనగ్ పై దాడి చేసిన శ్రీనివాస్ రావును విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఎన్ ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసున విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. అర్ధరాత్రి శ్రీనివాస్ రావును విచారణ నిమిత్తం అధికారులు విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రత్యేక కోర్టులో అధికారులు శ్రీనివాసరావును హాజరుపర్చనున్నారు.

విశాఖ ఎయిర్ పోర్టులో 2018లో జగన్ పై శ్రీనివాస్ రావు అనే వ్యక్తి పందెం కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి కేసు ఏపీలో సంచలనం కలిగించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. మరోవైపు జనగ్ పై దాడి విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. పరస్పరం విమర్శించుకున్నారు. 

 

 

ట్రెండింగ్ వార్తలు