బెజవాడ నీదా నాదా : ఆ మూడు స్థానాల పరిస్థితేంటీ ? 

ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.

  • Publish Date - April 5, 2019 / 02:06 PM IST

ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.

ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది. బెజవాడ తమ అడ్డా అని నిరూపించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే విజయవాడలో విజయం తమదే అనిపించుకోవాలని వైసీపీ గట్టిగా పోరాడుతోంది. ఈ రెండు పార్టీలకు తోడుగా జనసేన కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతకీ ఆ మూడు స్థానాల్లో పరిస్థితేంటి…? బెజవాడలో రాజకీయం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది.
Read Also : కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా

ఎలక్షన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు సీట్లలో టీడీపీ విజయం సాధించి దశాబ్దాలు గడిచిపోతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా… ఆ సీట్లు మాత్రం టీడీపీ ఖాతాలో పడలేదు. అలాంటి ఒక స్థానమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. వర్తక, వాణిజ్య ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారు, మైనార్టీలు అధికంగా జీవిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసవచ్చిన బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. 1999 నుంచి టీడీపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన జలీల్‌ఖాన్‌ తర్వాత సైకిలెక్కారు. 

మైనార్టీ ప్రాబల్యం కాస్త ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఈసారి జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖతూన్ బరిలోకి దిగగా… వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బరిలో నిలిచారు. మరోసారి గెలుచుకోవాలని వైసీపీ..కూతురి గెలుపు కోసం జలీల్ ఖాన్ పోరాడుతున్నారు. 2009లో పీఆర్పీ తరపున గెలిచిన వెల్లంపల్లి తర్వాత బీజేపీలో ఆ తర్వాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు సీటు ఇవ్వడాన్ని కొందరు వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా కోరాడ విజయ్‌కుమార్‌ బరిలో నిలిచారు. 
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

జనసేన టిక్కెట్‌ పోతిన వెంకట మహేష్‌కు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రధాన అభ్యర్థులతో సమానంగా ఢీ కొంటున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు మైనార్టీ, ఆర్యవైశ్య, నగరాలు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ముగ్గురి మధ్య పోరు డూ ఆర్ డైగా సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని టీడీపీ నమ్ముతోంది. అయితే ముస్లిం వర్గం నుంచి పూర్తిస్థాయిలో సహకారం లేకపోవడం, టీడీపీ నేతల మధ్య సమన్వయ లోపం కాస్త ఇబ్బందికరంగా మారింది. 

వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ పూర్తిగా జగన్‌ చరిష్మాపైనే నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలు మారడం ఆయనకు మైనస్… పైగా గతంలో బీజేపీలో ఉండటంతో ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గం కలసిరావడం కాస్త అనుమానంగా మారింది. జనసేన అభ్యర్థికి పవన్ చరిష్మా, సొంత సామాజికవర్గం కలసివచ్చే అంశాలు. నిరంతరం ప్రజల్లో ఉండటం కూడా ప్లస్ అవుతుందంటున్నారు. అయితే సీనియర్‌ నేతలతో సమన్వయ లోపం కాస్త ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గంలో వీరి ముగ్గురితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ కూడా బలంగానే ఉన్నారు. దీంతో ఈయన ఎవరి ఓట్లు చీలుస్తారోనని ముగ్గురు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
Read Also : విజయవాడలో ధర్నాకు దిగిన చంద్రబాబు