ఎన్నికల అధికారులు, పోలీసులు ఆళ్లగడ్డలో వైఫల్యం చెందారని..తగినంత బలగాలు ఇక్కడ కేటాయించకపోవడంతో గొడవలను అరికట్టలేక పోయారని TDP అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై స్పందించారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం 10tvతో ముచ్చటించారు. పీడీ యాక్ట్ కింద నమోదైన వ్యక్తి ఏజెంట్‌గా కూర్చొవడంపై తన సోదరి సిబ్బందిని ప్రశ్నించినట్లు.. సోదరిపై కొందరు దూసుకరావడంతో తన భర్త అక్కడకు వెళ్లడం..అందరినీ ఒక దగ్గరకు వచ్చేలా చేసి ప్లాన్డ్‌గా వైసీపీ నేతలు దాడి చేస్తారని ఊహించలేదన్నారు. మహిళ అని చూడకుండా అలా వ్యవహరించడం దారుణమన్నారు.
గొడవలు జరిగిన క్రమంలో తాను అహోబిలానికి వెళ్లనే లేదని చెప్పుకొచ్చారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు..ఓటింగ్ శాతం పెంచే విధంగా కృషి చేసినట్లు చెప్పారామె. పోలింగ్ ప్రశాంతంగా జరిగాలని భావించి వెనక్కి వచ్చామన్నారు. ఆ సమయంలో స్థానికులు రక్షణ కల్పించినట్లు..దీనితో ఎదురు దాడి జరిగిందన్నారు. ఆళ్లగడ్డలోనే కాదు..ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై దాడులు జరిగినట్లు వెల్లడించారు.
ఘర్షణలు జరిగినా పోలీసులు, ఈసీ స్పందించలేదన్నారు. ఫోర్స్ పంపించాలని కోరితే నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు భూమా అఖిల. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 85 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ప్రజలందరూ మార్పుకు ఓటు వేస్తారని తెలిపారు. ఎవరికి ఓటు వేస్తే ప్రశాంతంగా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. ఫ్యాక్షన్ తాము ఎంకరేజ్ చేయమని భూమా అఖిల ప్రియ చెప్పారు.