ఏపీ ఎన్నికల బరిలో బిగ్ బాస్ ఫేం

  • Publish Date - March 29, 2019 / 07:01 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీకి బిగ్‌బాస్ ఫేమ్ సంజన అన్నే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తుంది. నేనేరాజు నేనేమంత్రి సినిమాలో నటించిన సంజన తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్‌లో సామాన్యురాలు కోటాలో ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలివీక్ ఎలిమినేషన్‌లోనే ఆమె హౌస్ నుండి బయటకు వచ్చేశారు. అయితే బయటకు వచ్చాక పలు ఇంటర్వ్యూలకు వెళ్లిన సంజన కాంట్రవర్శీ కామెంట్లతో వార్తల్లో నిలిచింది.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

కృష్ణా జిల్లాకు చెందిన అన్నే సంజన నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన వ్యక్తి. అన్నే సంజన అసలు పేరు అన్నే వనజ. అన్నే వనజ 2016లో మిస్‌ హైదరాబాద్‌గా ఎంపికైంది. సినీపరిశ్రమకు వెళ్లాక ఆమె జనజాగృతి పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నూజివీడు అభ్యర్థిగా పోటీచేసేందుకు కూడా ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నూజివీడు అసెంబ్లీ నుంచి పోటీలోకి దిగింది మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావుకు దగ్గరి బంధువు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష