Biker Video Viral: క్షణాల వ్యవధిలో రెండుసార్లు యువకుడి ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. వీడియో వైరల్

ఓ యువకుడు రోడ్డుపై బైకుపై వెళ్తున్న సమయంలో ఓ కారును దాటుకుని వెళ్లాలని భావించాడు. అయితే, అదే సమయానికి కారు ఎడమవైపు ముందుకు వెళ్లడంతో దానికి ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టి కింద పడ్డాడు. అతడి తల రోడ్డుకి తగిలింది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో అతడు బతికిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అక్కడి స్తంభం కుప్పకూలి ఆ యువకుడి తలపై పడింది. మళ్ళీ అతడిని హెల్మెట్ రక్షించింది.

Biker Video Viral: ఢిల్లీలో ఓ యువకుడి ప్రాణాలు కాపాడింది అతడు పెట్టుకున్న హెల్మెట్.. అదీ వెనువెంటనే రెండుసార్లు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి ప్రతి ద్విచక్ర వాహనదారుడూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ‘‘హెల్మెట్ పెట్టుకుంటే ఒక్కసారి కాదు.. రెండు, మూడు, అనేక సార్లు అది మిమ్మల్ని కాపాడుతుంది’’ అని పేర్కొన్నారు. హెల్మెట్ పెట్టుకున్న వారిని దేవుడు రక్షిస్తాడని అన్నారు.

ఓ యువకుడు రోడ్డుపై బైకుపై వెళ్తున్న సమయంలో ఓ కారును దాటుకుని వెళ్లాలని భావించాడు. అయితే, అదే సమయానికి కారు ఎడమవైపు ముందుకు వెళ్లడంతో దానికి ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టి కింద పడ్డాడు. అతడి తల రోడ్డుకి తగిలింది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో అతడు బతికిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అక్కడి స్తంభం కుప్పకూలి ఆ యువకుడి తలపై పడింది. మళ్ళీ అతడిని హెల్మెట్ రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హెల్మెట్ పెట్టుకోకపోతే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయేవాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు.. నిన్న కోలుకున్న 5,916 మంది

ట్రెండింగ్ వార్తలు