బావిలోని బస్తాల్లో శవాలు : హిజ్రా దంపతులు..మరో హిజ్రా దారుణ హత్య

  • Publish Date - August 22, 2020 / 12:28 PM IST

తమిళనాడులో తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో దారుణం జరిగింది. ఓ హిజ్రా ..ఆమె భర్తతో పాటు మరో హిజ్రా కూడా దారుణ హత్యకు బలైపోయారు. సూత్తమల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. శుక్రవారం (ఆగస్టు 21,2020) జరిగిన ఈ మూడు హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



వివరాల్లోకి వెళితే..సూత్తమల్లిలోని నరసింగనల్లూరులో హిజ్రాలు భవాని (28), అనుష్క, ఆమె భర్త మురుగన్‌ (30)లు గురువారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారితో కలిసి నివసించే సహ హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

వారిచ్చిన సమాచారంతో పాళయంకోట చౌరస్తా సమీపంలో ఉన్న బావిలో గోనె సంచుల్లో కట్టి పడేసిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తమతోటి హిజ్రాలు అంత దారుణంగా చనిపోవటానికి జీర్ణించుకోలేని తోటి హిజ్రాలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.



పోలీసుల కథనం ప్రకారం..సేలం నుండి వచ్చిన రిషికేశ్ అనే యువకుడు తిరునెల్వేలిలో రేణుక అనే ట్రాన్స్ తో కలిసి ఉండేవాడు. వాళ్లిద్దరూ నరసింగనల్లూరుకు వెళ్లటంతో రిషికేశ్ అనుష్కతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. అలా అనుష్కను రిషికేశ్ తరచూ డబ్బు అడుగుతుండేవాడు. అనుష్క చాలాసార్లు రిసికేశ్ కు డబ్బులు ఇచ్చేది. అలా ఇచ్చిన డబ్బులు తిరిగి అడగటంతో రిషికేశ్ అనుష్కతో పాటు ఆమె భర్త మురుగన్ ను వారితో కలిసి ఉండే భవనీలను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అలా వారిని చంపి..తన స్నేహితుల సహాయంతో రిషికేశ్ మృతదేహాల్ని ఓ బస్తాలో వేసి పాలయంకోట్టై సమీపంలోని బావిలో పడేశాడని తెలిపారు.

నిందుతుల్ని విచారించగా వారిచ్చిన సమాచారంతో బావిలో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బందితో కలిసి వెళ్లి బావి..అక్కడికి సమీపంలో ఉన్న మరో బావిలో గాలించగా..ఆ బస్తాల్లో లభ్యమైన రెండు బస్తాల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్ట్‌మార్టం కోసం తిరునెల్వేలి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.