రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

  • Publish Date - October 22, 2019 / 07:32 AM IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించి రైతులకు సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రతీ నియోజకవర్గంలో బోర్లు వేయించడం.

ఈ పథకానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో రిగ్గు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 200 రిగ్గులను ఏర్పాటు చేయబోతున్నారు.

బోర్లు వేయదలచుకున్న రైతుల వివరాలను నమోదు చేసుకొని ఉచితంగా బోర్లు వేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఇప్పుడు దానికి సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 200 రిగ్గులు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది ప్రభుుత్వం. పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తాం అంటూ సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.