ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాధినేని యామినీ శర్మ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌ని కలిసిన రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయిశర్మ, మహిళా అధ్యక్షురాలు యామిని శర్మ ఓ లేఖను అందజేశారు.
రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందుల రీత్యా బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కలిసినట్లు వారు వివరించారు.
దీనిపై ప్రభుత్వంతో చర్చించాలని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకుని వచ్చేందుకు క రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయిశర్మ, మహిళా అధ్యక్షురాలు యామినిశర్మ విజ్ఞప్తిచేశారు.
విజయవాడలో రాజ్‌భవన్ వద్ద గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడే తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ చెప్పినట్లు యామినీ శర్మ వెల్లడించారు.