దేవుడి దయ : చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని హోమం

  • Publish Date - March 21, 2019 / 05:25 AM IST

విజయవాడ:  నామినేషన్ల పర్వం  మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ  పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికాలోకి రావాలని, చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలని కోరుతూ  ఆ పార్టీ  ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విజయవాడలో  గురువారం  చండీ యాగం నిర్వహించారు. టిడిపి విజయాన్ని ఏ దుష్ట శక్తి అడ్డుకోకుండా ఉండాలని భగవంతుడ్ని కోరుతున్నామన్నారు.

ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తిరిగి ప్రభుత్వం ఏర్పడటానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో నేరుగా చంద్రబాబుతో తలపడే ధైర్యం లేక కొంతమంది ముఠాగా ఏర్పడి  కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకి  ప్రజల ఆశీర్వాదంతో పాటు దైవ శక్తి కూడా తోడవ్వాలని చండీ యాగం చేపట్టామని బుద్ధా వెంకన్న తెలిపారు.