ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించట్లేదు: కేసు పెట్టిన రాజధాని రైతులు

  • Publish Date - December 23, 2019 / 06:40 AM IST

మూడు రాచజధానులు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు ఆంధోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజధానుల విషయమై తీవ్ర ఆందోళనలు జరుపుతున్న క్రమంలోనే కృష్ణా, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల స్థానిక ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై మండిపడుతున్నారు. లేటెస్ట్‌గా ఇదే విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిడమర్రు రైతులు కేసు పెట్టారు.

మంగళగిరి ఎమ్యేల్యే కనుబడటంలేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకున్న రైతులు ఎమ్మెల్యే ఆళ్ల కనిపించట్లేదని కేసు పెట్టారు.