తాడేపల్లి సీఐ బదిలీ : పోలీసులపై ఈసీ చర్యలు 

  • Publish Date - April 9, 2019 / 04:48 PM IST

అమరావతి :  సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్  సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో  ట్రాన్స్‌ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో  ప్రకాశం జిల్లా ఎస్పీ కోయప్రవీణ్ ను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక సీఐ పై చర్యలు తీసుకుంది.  పోలింగ్ కు మరో 36 గంటలు సమయం ఉండగా ఈ బదిలీలు కలకలంరేపుతున్నాయి. 

గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం సీఎం చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ చేసిన ఫిర్యాదుతో  తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐ శ్రీనివాస్‌రావుపై ఈసీ బదిలీ వేటు వేసింది. శ్రీనివాసరావు స్థానంలో కొత్త సీఐగా సురేశ్‌ కుమార్‌ను నియమించింది ఎన్నికల సంఘం.