కోర్టుకు హాజరైన చంద్రబాబు : ప్రమాణం చేసిన సీఎం

  • Publish Date - March 23, 2019 / 05:38 AM IST

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ  శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు దాఖలు చేశారు. 

నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రమాణం చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లలేకపోయారు. దీంతో విజయవాడలోని స్థానిక కోర్టుకి హాజరయ్యి.. ప్రమాణం చేశారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ లోని 4వ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎదుట సీఎం ప్రమాణం చేశారు. భారీ ఎత్తున టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. 
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం