చంద్రబాబు జోస్యం : టీడీపీకి 110 సీట్లు గ్యారెంటీ

  • Publish Date - April 15, 2019 / 08:11 AM IST

ఏపీలో మళ్లీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం వెయ్యి శాతం తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. 110-140 సీట్లు గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ పోరాటం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకే అని స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు సంఘటితంగా పనిచేశాయని, అందుకే టీడీపీ గెలుపు ఏకపక్షం అయ్యిందని అన్నారు. టీడీపీ గెలుపు అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, అయినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు.

తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలో 8 లక్షల ఓట్ల తొలగింపుకు కుట్రలు జరిగాయని, సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేసినట్లు చంద్రబాబు చెప్పారు. చెన్నై, షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి భారీగా తరలివచ్చి టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని అన్నారు. ఎన్నికల సంఘంపై 15 ఏళ్లుగా టీడీపీ పోరాడుతుందని, ఈవీఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరుతుంటే.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని అన్నారు.