అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ..ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దాంట్లో భాగంగానే ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశారని ఇది సరైందిక కాదని ఇది చాలా తప్పు అని చంద్రబాబు అన్నారు. జగన్ విధ్వంసకర కక్ష సాధింపు పాలన చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ హయంలో పనిచేసినవారిపై వైసీపీ ప్రభుత్వం కావాలని వేధిస్తోందని..అధికారులకు జీతాలివ్వకుండా..పోస్టింగ్ లకు ఇవ్వకుండా సాధిస్తున్నారని ఆరోపించారు. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఏ రాష్ట్రంలోను ఇటువంటి అరాచక విధ్వంసకర పాలన చూడలేదని వాపోయారు. ఇంతటి సీనియర్ ఆఫీసర్ ని కక్షపూరితంగా కావాలని సస్పెండ్ చేయటం దారుణమన్నారు. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.