కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్ : నామినేషన్ల వెల్లువ

ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు

  • Publish Date - March 22, 2019 / 01:26 PM IST

ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు

ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నామినేషన్లు వేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు తరఫున ఆయన వ్యక్తిగత కార్యదర్శులు నామినేషన్ పత్రాలను అధికారులకు అందించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుండి 7 సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 1989లో కుప్పం నుంచి మొదటి సారి పోటీ చేసి 10వేల లోపు మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు ఓడిపోలేదు.
Read Also : వాళ్లు అలా : జగన్ ఫ్యామిలీ ఆస్తులు ఇలా..

కడప జిల్లా పులివెందులలో వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ వేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహసిల్దార్‌ కార్యాలయంలో.. సరిగ్గా మధ్యాహ్నం 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. జననేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జనసైనికులతో ర్యాలీగా వెళ్లి.. తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్‌కు ముందు జనసేనాని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నారా లోకేష్.. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉండవల్లి నుంచి టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి మంగళగిరిలో నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నారా లోకేష్ వెంట తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఉన్నారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందని లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదిస్తే మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెడతానన్నారు. రాబోయే రోజుల్లో మంగళగిరి ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా ఆశ్వీరదిస్తారని.. భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Read Also : రౌడీ రాజకీయాలపై పవన్ ఫైర్ : తాట తీస్తానంటూ హెచ్చరిక

హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆర్ధికలోటులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత టీడీపీకే దక్కుతుందని బాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి భవానీ, గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కోడెల శివప్రసాదరావు, రాజమహేంద్రవరం ఎంపీ జనసేన అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి దామచర్ల జనార్థన్‌, వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నామినేషన్లు వేశారు.