కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ సీఎం బాబు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా బ్రేక్ ఇస్తారా ? జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడంటూ ఇటీవలే హెచ్చరించారు. జగన్ ప్రచారం ఆపేసి ఒకరోజంతా లోటస్ పాండులో ఉన్నాడని..ఏదో కుట్రకు పూనుకుంటున్నారని బాబు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 03వ తేదీన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాబు..ఈ అంశంపై మాట్లాడారు.
లోటస్ పాండులో కూర్చొని కొత్త కుట్రకు శ్రీకారం చుట్టారని..రేపో..ఎల్లుండో పెద్ద ఎత్తున్న కుట్ర చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్లాన్స్ చేస్తున్నారని బాబు వెల్లడించారు. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని వారు ప్రయత్నిస్తున్నట్లు చెప్పిన బాబు..టీడీపీ నేతలను కొనుక్కోవాలని అనుకుంటున్నారని తెలిపారు. బూత్ కమిటీలు, పార్టీ నేతలు, మహిళలు వీటిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి, మోడీ, కేసీఆర్‌లు దుర్మార్గులు. సత్యం చెప్పరు. అన్నీ తప్పుడు మాటలే అంటూ చెప్పారు. ఎవరి హాయంలో ఉదయగిరి అభివృద్ధి అయ్యిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని బాబు ప్రజలకు సూచించారు.