పుల్వామా అమరుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ విలువైన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల ముందే బీసీసీఐ.. ఐపీఎల్ కోసం ఆరంభ వేడుకల కోసం పెట్టే ఖర్చు రూ.20కోట్లు పుల్వామా అమరుల కోసం కేటాయిస్తామంటూ ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ధోనీ కెప్టెన్సీ వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ మ్యాచ్ లకు వచ్చే టిక్కెట్లపై ఆధాయం మొత్తాన్ని పుల్వామా అమరుల కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
జట్టు డైరక్టర్ రాకేశ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ విరాళానికి సంబంధించిన చెక్‌ను చెన్నై జట్టు కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో భారత ఆర్మీకి అందించనున్నాడు’ అని తెలిపాడు.
లీగ్‌లో తొలి మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనున్న తరుణంలో మార్చి 23వ తేదీకి చిదంబరం స్టేడియంలో టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. పునరాగమనంలో టైటిల్ విజేతగా నిలవడంతో చెన్నై జట్టుపై మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తోన్న బస్సు ఆత్మాహుతి దాడికి గురైంది. ఇందులో 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.