ఏ పార్టీ నుంచి అంటే : ఎన్నికల ప్రచారానికి చిరంజీవి

  • Publish Date - April 3, 2019 / 07:11 AM IST

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గోనబోతన్నారా? అంటే అవుననే అంటున్నారు. అయితే చిరంజీవి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నది తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు కాదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర రెడ్డికి.  తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపును ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని, తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రకటించారు.

గతకొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి, ఇటీవలికాలంలో జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల కొండ విశ్వశ్వర రెడ్డి ఇదే విషయమై చిరంజీవిని కలిసినట్లు చెబుతున్నారు. చిరంజీవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తన కోడలు ఉపాసనకు విశ్వేశ్వర్ రెడ్డి బాబాయి అవుతారు.