విజయవాడలోని గాంధీనగర్ పోలీసు క్వార్టర్స్ సీఐ సూర్యనారయణ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను 1989 బ్యాచ్ కి చెందిన వారు. కొంతకాలంగా విజయవాడ ఏ. ఆర్ గ్రౌండ్స్ లో సీఐగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు.
1990 బ్యాచ్‌కి చెందిన వారు డీఎస్పీలుగా పదోన్నతి పొందినప్పటికీ… సూర్య నారాయణకు రిమార్క్స్ కారణంగా పదోన్నతి రాలేదని తెలుస్తోంది. అంతేగాకుండా ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సూర్యనారాయణ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read More : అతివేగమే కారణమా : దివాకర్ బస్సు పల్టీ