పూతలపట్టులో లాఠీచార్జ్ : YCP – TDP లీడర్స్ ఫైటింగ్

  • Publish Date - April 11, 2019 / 05:40 AM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టులో YCP – TDP నేతలు కొట్టుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే..కొద్దిసేపటి అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పూతలపట్టు..బందార్లపల్లెలో ఓటర్ల స్లిప్పుల విషయంలో ఓ పార్టీకి..ఓటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మధ్యలో మరో పార్టీకి చెందిన నేతలు జోక్యం చేసుకున్నారు. గొడవ ఇరు పార్టీలకు చెందిన వ్యవహారంగా మారిపోయింది. తోసుకోవడం..కొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. అక్కడనే ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీలకు పని చెప్పారు. అక్కడున్న వారిని చెదరగొట్టారు. కార్యకర్తలు తలో దిక్కుకు పారిపోయారు. ఓటు వేయడానిక ివచ్చిన వారు భయపడిపోయారు. పోలింగ్ కేంద్రంలోకి 200 మీటర్ల దూరంలో ఎవరినీ రానివ్వడం లేదు. 144 సెక్షన్ విధించారు.