కిక్కుదించేస్తారట : వైన్ షాపులు..బార్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం

  • Publish Date - August 31, 2019 / 01:30 AM IST

ఏపీలో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దిశగా సీఎం జగన్‌ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వాహణ జరగనుంది. ఈ క్రమంలో మద్యపాన నిషేధం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.

అక్టోబరు నుంచి ఏపీలో వైన్ షాపులు, బార్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని తెలిపారు. అక్టోబ‌ర్ నుంచి శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తామని ట్విట్టర్‌లో తెలిపారు. అక్రమ మద్యాన్ని, నాటు సారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నామని..దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ట్వీట్‌ చేశారు.
Read More : శనివారం నుంచి భారీ వర్షాలు 
మద్య నిషేధంలో భాగంగా మద్యానికి బానిసైన వారిలో మార్పు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతోంది. వాటి కోసం సుమారు రూ. 500 కేటాయించింది ఏపీ సర్కార్. అంతేగాకుండా..చిన్నప్పటి నుంచే మద్యపానంపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని సిలబస్‌లో చేర్చాలని సూచించింది.