వైఎస్సార్ కి  నివాళులర్పించిన సీఎం జగన్ 

  • Publish Date - September 2, 2019 / 08:28 AM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం, సెప్టెంబరు 2న కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్. 

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించినవారిలో ఉన్నారు. వారితో పాటు వైసీపీ నాయకులు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌డ్డి, వైఎస్సార్‌ అభిమానులు పలువురు నివాళులర్పించారు.  

ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం సీఎం జగన్‌ భాకరాపురం చేరుకుని తన బాబాయ్  వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.