కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు : సీఎం జగన్ 

రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

  • Publish Date - February 17, 2020 / 10:10 AM IST

రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సోమవారం (ఫిబ్రవరి 17, 2020) అమరావతిలో ఐటీ పాలసీ, నైపుణ్యావృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఐటీఐ కాలేజీల్లో నాడు-నేడు కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

4 ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా 4 స్కిల్స్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పులివెందుల జెఎన్ టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలో ఐటీ రంగం కోసం హై-ఎండ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

భవిష్యత్ లో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 సంస్థలు స్థాపించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ చేయనున్నట్లు తెలిపారు. ఖాళీల భర్తీపైనా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.