కొత్త చట్టం : ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే జైలే

ఇసుక సరఫరా పెంపుపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించారు.

  • Publish Date - November 6, 2019 / 01:40 PM IST

ఇసుక సరఫరా పెంపుపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించారు.

ఇసుకపై సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక సరఫరా పెంపుపై బుధవారం (నవంబర్ 6, 2019) సీఎం జగన్ సమీక్ష చేశారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలను సీఎం ప్రకటించారు. ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తేవాలన్నారు. ఇసుక ధరలను ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలన్నారు. నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాలన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఇసుక సరఫరా, ధరలు, ఇసుక మాఫియా, స్మగింగ్ నివారించే విధంగా సమావేశం నిర్వహించారు. అధిక ధరలకు ఇసుక అమ్మకుండా ప్రత్యేక చట్టం తీసుకరావాలన్నారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలన్నారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా ఇసుక ధరలను నిర్ణయంచి, కలెక్టర్లు, గనుల శాఖ వీటికి సంబంధించి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఇసుక ధరలు నిర్ణయించాలని సూచించారు. ఇసుక ధరలు నిర్ణయించాక అదే ధరకు అమ్మాలి…అలా కాకుండా ఎక్కువ ధరలకు అమ్మినట్లైతే, ఏదైనా మాఫియా చేసినట్లైతే వారికి కచ్చితంగా జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో మద్యంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా గ్రామాల్లో లిక్కరు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి, వారిని కూడా జైలుకు పంపించాలన్నారు. బెల్టు షాపు అనేది ఎక్కడా కనిపించకూడదన్నారు. దీనిపై టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, ఎవరైనా గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇసుక, మద్యం చాలా కీలకం.. ఈ రెండింటిలో ఎక్కువగా మాఫియా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.