అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో రుణ మాఫీ : రాహుల్ గాంధీ 

  • Publish Date - March 31, 2019 / 01:21 PM IST

కళ్యాణ దుర్గం: దేశంలో నరేంద్ర మోడీ పాలన వల్ల  ధనవంతులకే లాభం చేకూరిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీలకే లాభం చేకూరిందని, మోడీ కి సామాన్యుల బాధలు పట్టవని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో  ఆదివారం జరిగిన  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ..దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉన్నారని,  చిన్న సన్నకారు రైతులకు తాము పండించిన పంటలకు గిట్టుబాటుధరలు రాక అల్లాడి పోతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఏపీ రైతుల రుణాలను 2 రోజుల్లో మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.  మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు. 
Read Also : ఓ హాస్పిటల్.. 9మంది నర్సులు.. ఒకేసారి ప్రెగ్నెన్సీ

కరువు ప్రాంతమైన రాయలసీమ పై ప్రత్యేక దృష్టి పెడతానని రాహుల్ తెలిపారు. దేశంలో విద్యావ్యవస్దను మోడీ కార్పోరేట్ మయం చేశారని అన్నారు.  ఉద్యోగాలు లేక యువత అల్లాడి పోతుంటే రఫేల్ డీల్ తో రూ.30 వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీకి కట్ట బెట్టారని ఆరోపించారు. దేశంలోపెద్దనోట్ల రద్దువల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం అయ్యిందని అన్నారు. దేశాన్ని ధనవంతులు, పేదవారు అని రెండు వర్గాలుగా  మోడీ విడదీశారని  అన్నారు.  ఉద్యోగాలు లేక గడిచిన 5 ఏళ్లలో  యువత అల్లాడుతున్నారు.  సామాన్యులకు సాయంచేసేందుకు న్యాయ్ తీసుకు వస్తున్నామని రాహుల్ తెలిపారు. దీని వల్ల దేశంలో25 కోట్ల మంది పేదలకు  లాభం చేకూరుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. 
Read Also : జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా : జగన్