ఉరివేసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

  • Publish Date - October 6, 2019 / 11:19 AM IST

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడుచర్ల మండలం కల్లూరుకు చెందిన శ్రీధర్‌ మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో కల్లూరులోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

శ్రీధర్‌ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.