న్యూ ఇయర్ 2019 : సెలబ్రేషన్స్‌లో పోలీసుల ఆంక్షలు

  • Publish Date - December 31, 2018 / 10:21 AM IST

విజయవాడ : కొద్దిగంటల్లో 2018 క్యాలెండర్ ముగియనుంది. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. షాపింగ్ మాల్స్..బేకరీలు…స్వీటు షాపులు కిటకిటలాడుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు సూచించారు. న్యూఇయర్ వేడుకలలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బార్స్, రెస్టారెంట్స్, అర్ధరాత్రి వరకూ నిర్వహిస్తే… కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకులు ప్రశాంత వాతవరణంలో జరగాలి.

  • న్యూఇయర్ వేడుకలలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే  కఠిన చర్యలు. 
  • బార్స్,  రెస్టారెంట్స్,  ఆర్ధరాత్రి వరకూ నిర్వహిస్తే… కఠిన చర్యలు.
  • హోటల్స్ లో నిర్వహించే ఈవెంట్స్‌లో డాన్సులు, అశ్లీల నృత్యాలు  నిషేధం. 
  • పోలీస్ రూల్స్‌ను హోటల్ నిర్వహకులు అతిక్రమిస్తే… కఠిన చర్యలు.
  • నూతన సంవత్సర వేడుకులు సంస్ధలుకాని… వ్యక్తులు కాని నిర్వహిస్తే…పోలీస్ అనుమతి తప్పని సరి.
  • మైనర్లు వాహనాలు నడిపితే సెక్షన్ 182,183 ప్రకారం కఠిన చర్యలు.
  • విజయవాడలో ప్రత్యేకంగా 40 పోలీస్ టీంల ఏర్పాటు. 
  • నగరంలో 12 చెక్ పోస్టులు ఏర్పాటు. మద్యం సేవించి వాహనాలు బ్రీత్  ఎనలైజర్ ద్వారా చెకింగ్.
  • 80 డెసిబుల్స్ కంటే హారన్‌లను, మైకులను ఉపయోగిస్తే… కఠిన చర్యలు.
  • 12:00 గంటలు దాటి ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు చేస్తే…. చట్టపరమైన చర్యలు.
  • రోడ్లపై కేక్ కటింగ్స్…..ఇతరులను ఇబ్బంది పెట్టే పనిచేస్తే కఠిన చర్యలు. 

ట్రెండింగ్ వార్తలు