ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
బాధితుడు ఇటీవలే లండన్ నుంచి ఇండియా వచ్చినట్లు గుర్తించారు. ఫంక్షన్ కి వచ్చివెళ్లినవారి వివరాలు తీసుకుని వారికి వైద్యం అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితుడు తెలంగాణ లోని కొత్తగూడెం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మార్చి 18వ తేదీన ఆ కుటుంబం రాఘవాపురంలో జరిగిన బంధువుల గృహప్రవేశానికి వచ్చి వెళ్లారు. వారు హైదరాబాద్ తిరిగి వెళ్లినతర్వాత పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇప్పటివరకు శుభకార్యానికి హాజరైన 75 మంది వివరాలు తీసుకుని వారిని ఇంటికే పరిమితం చేసి వైద్యం అందిస్తున్నారు. వారి ఇంటి చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ గ్రామానికి చేరుకుని పరిస్ధితిని అంచనా వేస్తున్నారు.
See Also | రోడ్డెక్కితే వెహికల్స్ సీజ్.. 7దాటితే మనుషులు కనిపించొద్దు: డీజీపీ