ఏపీలోని ఆ 4 జిల్లాలోనే కరోనా కేసులు ఎక్కువ

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల

  • Publish Date - April 9, 2020 / 08:09 AM IST

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత ఏపీలో ఒక్కసారిగా కేసులు డబుల్ అయ్యాయి. కాగా రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 348 కేసులు నమోదైతే.. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచే 60 శాతం కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం(ఏప్రిల్ 7,2020) రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు 854 శాంపిల్స్‌ పరీక్షించగా 34 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 348కు చేరింది. కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం.

* రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 75 కరోనా కేసులు నమోదు
* 49 కేసులతో రెండో స్థానంలో గుంటూరు జిల్లా
* 48 కేసులతో మూడో స్థానంలో నెల్లూరు జిల్లా
* 35 కేసులో నాలుగో స్థానంలో కృష్ణా జిల్లా
* గడిచిన రెండు రోజుల్లో గుంటూరు జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు. 
* బుధవారం(ఏప్రిల్ 8,2020) అనంతపురం జిల్లాలో 7 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది. 
* బుధవారం జరిపిన పరీక్షల్లో కృష్ణాలో 6 కేసులు, నెల్లూరు జిల్లాలో 5, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 3 కేసులు చొప్పున, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో 1 కేసు చొప్పున నమోదు.
* విశాఖపట్నం ఆసుపత్రిలో కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకుని ముగ్గురు బుధవారం డిశ్చార్జి అయ్యారు. వీరిలో ఇంగ్లాడ్‌ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడు, అతని ద్వారా కాంటాక్ట్‌ అయిన 51 ఏళ్ల వ్యక్తి, గతంలో మదీనా నుంచి వచ్చిన వ్యక్తి డిశ్చార్జి కాగా.. ఆయన ద్వారా సోకిన 49 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారు తొమ్మిదికి చేరింది. నలుగురు మరణించారు.
* నెల్లూరు జిల్లా వాకాడు మండలం తిరుమూరులో పదేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామంలో అలజడి రేగింది. 
* ఇటీవల ఈ గ్రామం నుంచి ఓ వ్యక్తి ఢిల్లీకి వెళ్లొచ్చాడు. ఈ వ్యక్తి ఇంటి సమీపంలోనే ఈ బాలిక ఇల్లు ఉండటం గమనార్హం.
* రాష్ట్రంలో 474 క్వారంటైన్‌ సెంటర్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిలో 46,872 పడకలు సిద్ధం చేసింది.

కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా ముప్పు ముంచుకొస్తుందోనని హడలిపోతున్నారు. అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ జిల్లాలో కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టారు. లాక్ డౌన్ ను కఠినతరం చేశారు. అందరికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనుమానం వస్తే ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

కాగా గురువారం(ఏప్రిల్ 9,2020) ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ప్రభుత్వానికి కొంత ఊరట ఇచ్చింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యఆరోగ్య బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల్లో 217 శాంపిల్స్‌ను పరీక్షించగా.. అన్ని కేసులు నెగటివ్‌గా వచ్చాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. 9మంది కోలుకున్నారు. 

ఏప్రిల్ 9వ తేదీ వరకు జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:
కర్నూలు – 75
గుంటూరు – 49
నెల్లూరు – 48
కృష్ణా – 35
కడప – 28
ప్రకాశం – 27
పశ్చిమగోదావరి – 22
చిత్తూరు – 20
విశాఖ – 20
అనంతపురం – 13
తూర్పుగోదావరి – 11

Also Read | కేరళ పోలీసుల క్రియేటివిటీ అదుర్స్, నవ్వులు పూయిస్తున్న రవిశాస్త్రి ట్రేసర్ బుల్లెట్