2018 వేలం ముగిసిన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పెద్దోళ్ల జట్టు, డాడీ టీం అంటూ రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐపీఎల్‌లో భాగంగా మార్చి 26 మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చేధనకు దిగి విజయం సొంతం చేసుకుంది చెన్నై.
‘మాకు వయస్సుతో సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ చేసి వెతుక్కోండి. మేమేమీ 60 సంవత్సరాల వయస్సున్నోళ్లం కాదు. మాది ముసలి(వృద్ధ) జట్టు కాదు. మేమింకా ఫిట్‌గానే ఉన్నాం. జట్టులో అందరూ 32-35ఏళ్లకు మించిలేరు. ప్రపంచంలో బెస్ట్ కెప్టెన్ నేతృత్వంలో ఆడుతున్నాం. ఏ ఆటలోనైనా అనుభవమే బాగా పనిచేస్తుంది. మా బలహీనతలేంటో మాకు తెలుసు వాటికి అనుగుణంగానే ఆడుతున్నాం’
‘కెప్టెన్ ధోనీకి జట్టుకేం కావాలో తెలుసు. స్టంప్స్ వెనకాల నుంచి అతనేం చెప్తే అది చేస్తాం. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఇంకా నేర్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నాం’ అని బ్రావో జట్టు వయస్సు, నైపుణ్యం గురించి చెప్పుకొచ్చాడు.