Cyclone Fani : ఏపీలో కంట్రోల్ నెంబర్లు ఇవే

  • Publish Date - April 28, 2019 / 05:21 AM IST

‘ఫణి’ తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ తుఫాన్ ఏపీకి 200 కిలోమీటర్ల బయటినుండే దిశ మార్చుకొనే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచానా వేస్తోంది. అయినా సరే..ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ వెల్లడించారు. 

అధికారులు అందరూ అలర్ట్‌గా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో ముందస్తుగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 08672- 252174, 252175 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.