తాడేపల్లికి కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయానికి చేరుకున్న దేవినేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సాధరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ సంధర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. జగన్ నవరత్నాలతో ప్రజలకు సేవ చేస్తున్నారని, ఆయన ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్లు వెల్లడించారు. జగన్ కష్టంలో సైనికులుగా ఆయనకు తోడుగా ఉండేందుకు పార్టీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. దేవినేని నెహ్రూ గారి అనుచరులు, అభిమానులు, తనతో పాటు పార్టీలో చేరినట్లుగా చెప్పారు దేవినేని అవినాష్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ నాయకత్వంలో చేరామని, సుబ్బారెడ్డి గారు, విజయ్ సాయి రెడ్డి గారు తన మీద, దేవినేని నెహ్రూ గారి మీద ఉండే అభిమానంతో సొంత కొడుకుకు ఇచ్చిన ప్రయారిటీ ఇచ్చారని ఆయన చెప్పారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్‌ను చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అందుకోసం వైసీపీలో గట్టిగా పని చేస్తామని అన్నారు దేవినేని అవినాష్.