ఆపరేషన్ వశిష్ట : బోటు తీసే దాక బట్టలు తీయను – శివ

  • Publish Date - October 3, 2019 / 05:57 AM IST

కచ్చులూరు గోదావరిలో మునిగిపోయిన బోటును తీసేదాక తాను ధరించిన డ్రెస్‌ని తీయనని మత్స్యకారుడు శివ వెల్లడిస్తున్నాడు. గోదావరి వరద ఉధృతిగా ప్రవహిస్తుండడం..సుడిగుండాలు ఉండడంతో అధికారులు ఆపరేషన్‌కు అనుమతినివ్వలేదు. దీంతో సత్యం బృందం దేవిపట్నం వద్దే ఆగిపోయింది. దర్మాడి సత్యం బృందం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో‌ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ మత్స్యకారుడు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను 10tv అడిగి తెలుసుకుంది. 

సుడిగుండాలు బాగా ఉంటాయని, బోటు వెలికి తీసే అవకాశం లేదన్నారు. మూడు రోజుల నుంచి జరుగుతున్న పనులను ఆయన వివరించారు. తనకు ఒక్క పైసా వద్దని..వెల్లడించి..తాను సత్యం బృందంతో పాల్గొన్నట్లు వెల్లడించాడు. తాను కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. విపరీతమైన వాసన వస్తోందని, పాత బెలూన్ వేసిన స్థలంలోనే బోటు ఉందని గుర్తించినట్లు తెలిపాడు. చిన్న యాంకర్ మాత్రమే వేసినట్లు..పెద్ద యాంకర్ వేసినట్లు తర్వాత..బోటును టచ్ చేయడం జరుగుతుందన్నారు.

ఇండియాలో ఇంతకన్నా ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, 300కు మించి లోతులో బోటులో ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. బోటు నిలబడితేనే తాము ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని, తాము తప్పకుండా బోటు తీస్తామని మరోసారి స్పష్టం చేశారు శివ. 

కచ్చులూరు గోదావరి ప్రమాదంలో మునిగిపోయిన.. రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. అక్టోబర్ 02వ తేదీ బుధవారం కురిసిన భారీ వర్షంతో… వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. అక్టోబర్ 03వ తేదీ గురువారం నాలుగో రోజు పనులు ప్రారంభించాల్సి ఉన్నా దర్మాడి సత్యం బృందం దేవీపట్నం దగ్గరే ఆగిపోయింది. వరద తగ్గే వరకు కచ్చులూరుకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కచ్చులూరులో సుడిగుండాలు ఎక్కువగా ఉండటంతో… ఆపరేషన్ వశిష్ట నాలుగో రోజు కొనగించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు.