ఏపీ DGPకి ఈసీ షాక్ : ACB DGగా శంకబ్రత బాగ్చి

ఎన్నికల వేళ ఏపీ డీజీపీ ఠాకూర్ కి ఈసీ షాక్ ఇచ్చింది. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతల నుంచి ఠాకూర్ ని తొలగించింది. ఆయన స్థానంలో ఏపీ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చిని

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 02:05 PM IST
ఏపీ DGPకి ఈసీ షాక్ : ACB DGగా శంకబ్రత బాగ్చి

Updated On : April 4, 2019 / 2:05 PM IST

ఎన్నికల వేళ ఏపీ డీజీపీ ఠాకూర్ కి ఈసీ షాక్ ఇచ్చింది. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతల నుంచి ఠాకూర్ ని తొలగించింది. ఆయన స్థానంలో ఏపీ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చిని

ఎన్నికల వేళ ఏపీ డీజీపీ ఠాకూర్ కి ఈసీ షాక్ ఇచ్చింది. ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతల నుంచి ఠాకూర్ ని తొలగించింది. ఆయన స్థానంలో ఏపీ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చిని నియమించింది. బాగ్చి ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ గా ఉన్నారు. డీజీపీ ఠాకూర్ తో మాట్లాడిన తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీజీపీ ఠాకూర్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఎన్నికల్లో టీడీపీకి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈసీకి వైసీపీ కంప్లయింట్ చేసింది. డీజీపీని తొలగించాలని డిమాండ్ చేసింది. అలాగే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీకి లేఖ రాసింది. దీంతో స్పందించిన ఈసీ.. ఠాకూర్ ను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇంతవరకు ఏసీబీకి డైరెక్టర్ గా ఉన్న శంకబ్రత బాగ్చిని.. డీజీగా అపాయింట్ చేసింది. నిజాయితీపరుడైన పోలీసు అధికారిగా బాగ్చికి పేరుంది. పోలీస్ శాఖలో ఎక్కడ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చినా వెంటనే ఆయన చర్యలు తీసుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఏఎస్పీగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. బాగ్చి 1986లో సర్వీస్ లోకి వచ్చారు.  ఎన్నికల వేళ పోలీస్ శాఖపై ఆరోపణలు రావడంతో ఆ శాఖను ప్రక్షాళన చేయాలని ఈసీ భావించింది. అందులో భాగంగా కొందరు ఐపీఎస్ అధికారులు, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. ఇప్పుడు ఠాకూర్ ను బాధ్యతల నుంచి తప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

డీజీపీ ఠాకూర్ ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తారని కొన్ని రోజులుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు బీజేపీ.. పదే పదే ఏపీ పోలీస్ శాఖపై ఆరోపణలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. దీంతో డీజీపీ మార్పు విషయంలో విస్తృతంగా జరిగింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే, ఈసీతో మాట్లాడుతున్న సమయంలోనే.. ఠాకూర్ ను ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతల నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? మరో కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు.. ఇద్దరు జిల్లా ఎస్పీలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలివ్వడం.. దానికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వ జీవో తీసుకురావడం, కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.