2రోజులు ఎన్నికల సెలవులు: స్కూళ్లకు అదనంగా ఒక రోజు

  • Publish Date - April 5, 2019 / 05:02 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముఖ్య తేదీలను సెలవులుగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు తొలివిడత ఆంధ్రలో ఎన్నికలు జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11న ఎన్నికలు, మే 23న లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ రెండు రోజులను సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ ఉత్తర్వులు విడుదల చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలోని 25 పార్లమెంట్‌ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. మరోవైపు పోలింగ్‌ కోసం ప్రభుత్వ, విద్యా సంస్థల భవనాలను ఎన్నికల కమిషన్‌ వాడుకుంటుంది. కాబట్టి ఎన్నికల ముందు రోజు అయిన ఎప్రిల్ 10వ తేదీన కూడా స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది.