ఏపీలో టీడీపీకి మరో షాక్ : బీజేపీలోకి ఆదినారాయణరెడ్డి

  • Publish Date - September 11, 2019 / 02:15 PM IST

ఏపీలో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలకు వల వేస్తోంది. మాజీ మంత్రి, కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు. ఆయన ఎప్పటి నుంచో పార్టీ మారుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ వీడకుండా ఉండేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 12వ తేదీ గురువారం బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోన్నారు ఆది నారాయణరెడ్డి. 

ఆది నారాయణరెడ్డి.. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఈయన..టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం చెందారు. జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావించిన ఈయనకు బాబు మొండిచెయ్యి చూపినట్లు ప్రచారం జరిగింది. ఈ టికెట్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. పరాజయం అనంతరం ఆదినారాయణ రెడ్డి టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల నేతలకు వెల్ కం చెబుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీలోని టీడీపీకి చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీకి చెందిన టీడీపీ కీలక నేతలు కమలం గూటికి చేరిపోయారు. తాజాగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరితే..రాయలసీమ ప్రాంతం నుంచి మరికొందరు నేతలు కూడా ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు