తెలుగుదేశం గూటికి మాజీ మంత్రి కొణతాల

  • Publish Date - March 22, 2019 / 05:59 AM IST

ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వినర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం గూటికి చేరబోతున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత రెండు రోజులుగా అనకాపల్లిలోని తన కార్యాలయంలో అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న కొణతాల.. టీడీపీలో చేరాలని నిర్ణయాంచుకున్నట్లు తెలుస్తుంది. గతవారం  వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని భావించిన కొణతాల పార్టీ కండువా కప్పుకునే సమయంలో పార్టీలో చేరకుండా ఆగిపోయారు.

ఈ క్రమంలో చంద్రబాబును కలిసిన కొణతాల.. అనుచరులతో కూడా చర్చించారు. ఆయన ఎటువెళ్లినా మద్దతిస్తామని అనుచరులు చెప్పడంతో టీడీపీలో చేరేందుకే కొణతాల మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. అయితే అనుచరులలో ఒక మాజీ సర్పంచ్‌ మాత్రం స్థానిక టీడీపీ నాయకులతో సర్దుకుపోలేనని, వైసీపీలోకి వెళతానని చెప్పినట్టు తెలుస్తుంది.
Read Also : ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్