వైసీపీ అధినేత జగన్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో టికెట్లను జగన్ అమ్ముకున్నారని, ప్రస్తుతం ఎన్నికలు రెండు భూస్వామ్యవర్గాల (టీడీపీ, వైసీపీ)మధ్య జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటిస్తూ…అణగారిన వర్గాల వారిని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు హర్షకుమార్. మార్చి 21వ తేదీ గురువారం హర్షకుమార్ మాట్లాడారు.
Read Also : తెలంగాణ BJP కి కొత్త రెక్కలు : సౌత్‌లో పాగా వేస్తుందా
గతంలో ప్రతిపక్షం స్థాయిలో తాను పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం 17 రోజులు జైళ్లో పెట్టిందని, దళితులపై దాడులు జరిగితే జగన్ స్పందించారా ? అని నిలదీశారు. ఓటు వేయలేదన్న కక్షతో దళితులను రాచిరంపాన పెడుతుంటే ఎలా ఊరుకోవాలని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గొంతెత్తి మాట్లాడుతుంటే..తాను అహర్నిశలు పోరాటం చేసినట్లు తెలిపారు. దళితుల సీట్లన్నీ డబ్బులున్న వారికి జగన్ అమ్ముకున్నారన్నారు హర్షకుమార్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరుగతోందని, వైసీపీలోకి వెళుదామని అనుకున్నా విరమించుకున్నట్లు వెల్లడించారు.
Read Also : మెగా బ్రదర్స్ గట్టెక్కేనా : వెస్ట్ గోదావరి ఎందుకు ?