జగన్ చెంతకు మాజీ ఎంపీ.. కుమారుడితో కలసి వైసీపీలోకి

  • Publish Date - April 4, 2019 / 04:13 AM IST

అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వైసీపీ గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన హర్షకుమార్.. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో కుమారుడు శ్రీహర్షతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవలే టీడీపీ అమలాపురం సీటు దక్కుతుందని భావించి టీడీపీలోకి వెళ్లిన హర్షకుమార్.. సీటు దక్కకపోవడంతో మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు.

అమలాపురం ఎంపీ టిక్కెట్టును జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌కు చంద్రబాబునాయడు కేటాయించారు.  దీంతో హర్షకుమార్ టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతూనే జగన్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్షకుమార్.. టీడీపీ కండువా తీయగానే ఎన్నికల్లో టీడీపీ ఒక్కటే పోటీ చేయట్లేదని, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ, టీడీపీ నాలుగు కలిసి పోటీ చేస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.