ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు : ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలి..

ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Publish Date - January 4, 2019 / 06:13 AM IST

ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

విశాఖ : ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి పైఅధికారులు నీతిగా ఉంటే కిందిస్థాయి ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తారనీ.. కేరళకు వెళితే అక్కడ అవినీతి అనేదే ఉండదనీ, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పారదర్శక పాలన ఉంటుందని తెలిపారు. అలా ఉంటేనే కేరళ ప్రజలు నాయకులకు ఎన్నికల్లో ఓటు వేస్తారని..కానీ ఏపీలోమాత్రం అవినీతి చేయకుంటే ఓటు వేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇక్కడ ప్రజల నుంచే అవినీతి మొదలయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అవినీతి జరిగిందనీ, అయితే చంద్రబాబు హయాంలో జరిగినంత దారుణంగా అయితే లేదని స్పష్టం చేశారు.

ఆదరణ పథకం కింద అందించిన వాషింగ్ మెషీన్లతో పాటు ఎల్ఈడీ లైట్లు..అన్న క్యాంటీన్లు సహా అవినీతి లేని పథకం ఒక్కటీ లేదని ఉండవల్లి విమర్శించారు. ఒక్కో ఎల్ఈడీ బల్బు రూ.600 ఉంటే ప్రజలకు రూ.6000కు అమ్మారని ఆరోపించారు. అన్న క్యాంటీన్ ఒక్కో ప్లేటుపై రూ.27 అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 2019లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే..‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండే ప్రభుత్వ ఆస్తులు అన్నీ స్థానిక ఎమ్మెల్యే అధీనంలోకి వెళాలనే తీర్మానం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఉండవల్లి ఘాటుగా ప్రశ్నించారు.

ఈ క్రమంలో  వైసీపీ నేత జగన్ కు కూడా చురకలంటించారు. ప్రతిపక్షంగా  వైసీపీ విఫలం అయిందని..అసలు అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు.