కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. మండలంలోని బెలుము గుహలు వద్ద టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. ఆళ్ల
ఓ హోటల్లో టీ తాగుతుండగా సుబ్బారావును వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. వైసీపీ కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. వైసీపీకి, టీడీపీ కార్యకర్తలకు మధ్య చోటుచేసుకున్న గొడవలే ఈ హత్యకు కారణం అని తెలుస్తుంది. కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా ఈ హత్య కలవెరపెడుతుంది.
సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. కొంతకాలంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావును రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు చుట్టుముట్టి విచక్షణారహితంగా వేటకొడవళ్లతో దాడి చేసి చంపారు. దీంతో సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు విచారణ మొదలుపెట్టారు.