ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాన్‌పై RTGS అంచనాలు నిజమయ్యాయని తెలిపిన బాబు..ఆర్టీజీఎస్ సమర్థవంతంగా పనిచేసిందని మెచ్చుకున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికార యంత్రాంగం పనిచేస్తోందన్నారు. కమ్యూనికేషన్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. మానవత్వంతో ప్రతొక్కరూ ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని..వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
మే 03వ తేదీ శుక్రవారం తుఫాన్ తీవ్రత గురించి మీడియాకు వెల్లడించారు. 14 మండలాలు..733 గ్రామాలు..408 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం చూపించిందన్నారు. వీటిలో కొన్నింటిని రీసోర్ట్ చేశామని..త్వరలోనే మరికొన్ని గ్రామాల్లో రీసోర్ట్ చేస్తామన్నారు. మొత్తం రూ. 10 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నామన్నారు. పునరావాస కేందాలకు తరలించిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్షా 14 వేల 500 మందికి ఆహారం అందించామన్నారు.
33 కేవీ ఫీడర్స్ దెబ్బతింటే 19 సరి చేశారు..11 కేవీ ఫీడర్స్ 101 దెబ్బతినగా 57 రీసోర్ట్ చేశారు…33/11 సబ్ స్టేషన్ 145 దెబ్బతినగా అందులో 34 మాత్రమే సరిదిద్దారు. 33 కేవీ పోల్ 72 పాడయ్యాయని..అందులో 46 సరిచేశారన్నారు. టెలీ కమ్యూనికేషన్‌కు చెందిన టవర్లు 218 దెబ్బతినగా 182 టవర్లు రీస్టోర్ చేశారన్నారు. 5 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడిందన్నారు బాబు.