చేనుకు నిప్పంటించి ఆత్మహత్యకు యత్నించిన రైతు

  • Publish Date - April 5, 2019 / 11:35 AM IST

పెద్దపల్లి జిల్లాలో రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి..సాగు చేసిన పంట నీళ్లు లేక తమ కళ్లెదుటే ఎండిపోతుండడం రైతులు చూడలేకపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక..ఆర్థిక స్థోమత లేకపోతుండడంతో ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఎండిపోయిన పంటకు నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. దీనిని తోటి రైతులు అడ్డుకున్నారు. ఎస్సారెస్సీ నీళ్లు చివరి ఆయుకట్టు వరకు అందడం లేదు. పంటలకు సాగునీరు అందించాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు. 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరిపల్లిలో సంజీవ్ అనే రైతు నాలుగు ఎకరాల పంట వేశాడు. అందులో రెండెకరాల పొలంలో నీళ్లు లేకపోవడంతో ఎండిపోయింది. నాలుగు ఎకరాల పొలంలో రెండెకరాల పొలం మొత్తం ఎండిపోయింది. ఎస్పారెస్పీ నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీనితో సంజీవ్ తీవ్ర లోలోపల కుమిలిపోయాడు. ఇక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. 

ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం పొలం వద్దకు చేరుకుని ఎండిపోయిన పంటకు నిప్పంటించాడు. అక్కడనే పురుగుల మందు తాగడానికి ప్రయత్నించాడు. దీనిని చూసిన తోటి రైతులు అతడిని వారించారు. ఆత్మహత్య వద్దని అతడిని సముదాయించే ప్రయత్నం చేశాడు. 

ట్రెండింగ్ వార్తలు