27 ఏళ్ల తర్వాత: కడపలో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం

  • Publish Date - March 26, 2019 / 02:23 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కంచుకోట కడపలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతుంది. ఈ క్రమంలో ఇవాళ(26 మార్చి 2019) కడపలో ప్రచారం చేయనున్న చంద్రబాబు ముస్లీం ఓటర్లే లక్ష్యంగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ప్రచారానికి తీసుకుని రానున్నారు. కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా అమీర్‌బాబు బరిలో ఉండడంతో.. ఫరూక్ అబ్దుల్లా చేత ప్రచారం చేయిస్తున్నారు.
ఈ క్రమంలో అస్మాస్‌పేట బహిరంగ సభలో ఫరూక్ ప్రసంగించనున్న టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అబ్దుల్లా ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తుంది. 1991 ఎన్నికల ప్రచారంలోనూ ఫరూక్ అబ్దుల్లా మొదటిసారి ఏపీలో ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌తో కలిసి ఆయన కడప, కమలాపురం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత ఫరూక్ మళ్లీ కడపకు వస్తున్నారు.