అగ్నిప్రమాదం: కాలిపోయిన చిన్నపిల్లల వ్యాక్సిన్

కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

  • Publish Date - January 13, 2019 / 03:24 PM IST

కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

కర్నూలు:  కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని శీతలీకరణ కేంద్రంలో నిల్వ ఉంచిన చిన్నపిల్లల వ్యాక్సిన్, కొన్ని రకాల మందులు కాలి బూడిదయ్యాయి. ఏసీ గదులు కావటంతో మంటలు త్వరితగతిన వ్యాపించాయి. అగ్ని ప్రమాద వార్త తెలిసి ఘటనా స్ధలానికి  చేరుకున్న 3 పైరింజన్లు 15 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

షార్ట్ సర్య్యూట్ కారణంగా  ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రులకు ఇక్కడినుంచే మందులు సరఫరా అవుతాయి. ఆదివారం  సెలవు కావటంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేరు. ఫిబ్రవరి 3న నిర్వహించే పల్స్ పోలియో  లో వాడాల్సిన 32 వేల వాయిల్స్ దగ్దమయ్యాయి.