విశాఖలో అగ్నిప్రమాదం: అధికారుల నిర్లక్ష్యం

  • Publish Date - January 26, 2019 / 03:46 PM IST

విశాఖపట్నం:  విశాఖపట్నంలో శనివారం  రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది  రూపాయల పైపుల అగ్నికి ఆహుతి అయ్యాయి. విశాఖ లోని ఆరిలోవ సెంట్రల్ జైల్ దగ్గర కృష్ణాపురంలో రోడ్డు పక్కన ఉన్న పైపులు తగలబడటంతో  భారీ అగ్నిప్రమాదం సంభంవించింది. మంటల్ని అదుపు చేయటానికి వచ్చిన ఫైర్ ఇంజన్ లో నీళ్లు అయిపోవటంతో ఫైర్ సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు.ఉన్న ఫైరింజన్ లో నీరు లేక పోవటం,, సరైన సమయంలో ఇంకో ఫైరింజన్  రాకపోవటంతో  ప్లాస్టిక్ పైపులు కాలి బూడిదయ్యాయి.